Diabetes జీవనశైలిలో మార్పుతో మధుమేహం నియంత్రణ
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:09 AM
Diabetes Control Through Lifestyle Changes జీవనశైలిలో మార్పుతో మధుమేహాన్ని నియం త్రించొచ్చని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
పార్వతీపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జీవనశైలిలో మార్పుతో మధుమేహాన్ని నియం త్రించొచ్చని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా పలువురికి షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ప్రధాన సమస్యగా ఉందన్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయి మించితే డయాబెటిస్ వస్తుందన్నారు. అధిక దాహం, ఆకలి, విపరీతమైన అలసట, తరచూ మత్ర విసర్జన, గాయం త్వరగా మానకపోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ‘అసంక్రమిత వ్యాధుల్లో ఒకటైన డయాబెటిస్ గుర్తించేందుకు వైద్య సిబ్బందితో ఎన్‌సీడీ సర్వే చేస్తున్నాం. దీనిలో భాగంగా వారు ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు నిండిన వారికి షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.’ అని జిల్లా ఎన్‌సీడీ అధికారి టి.జగన్మోహన్‌రావు తెలిపారు.
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
గరుగుబిల్లి: పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం రాయిందొరవలస, సన్యాసిరాజుపేట, పెదగుడబ గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ‘గృహాలకు ఆనుకుని మురుగు నీటి నిల్వలు, వ్యర్థాలు తొలగించాలి. ప్రజలు కలుషిత నీరు తాగకుండా చూడాలి. దోమల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.’ అని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మధుమేహం వలన కలిగే నష్టాలను వివరించారు. పీహెచ్‌సీల్లో ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.