Totapalli 16 నుంచి తోటపల్లిలో ధనుర్మాస ఉత్సవాలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:04 PM
Dhanurmasa Festival Celebrations at Totapalli from the 16th ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల్లో ఈ నెల 16నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిం చనున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. మంగళవారం నెల గంటు పెడతామని, జనవరి 14న దేవస్థానం ఆవరణలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు.
గరుగుబిల్లి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల్లో ఈ నెల 16నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిం చనున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. మంగళవారం నెల గంటు పెడతామని, జనవరి 14న దేవస్థానం ఆవరణలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవమూర్తులకు తిరువీధి మహోత్సవంతో పాటు పలు ప్రత్యేక పూజలు చేపడతా మన్నారు. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఇదిల ఉండగా శనివారం తోటపల్లికి భక్తులు పోటెత్తారు. ఉభయ దేవస్థానాల పరిధిలో స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మొత్తంగా దేవస్థానం ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది.