పైడిమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:53 PM
పైడిమాంబ దర్శనానికి మంగ ళవారం భక్తులు పోటెత్తారు. చదురుగుడివిస్తరణ పనుల నేపథ్యంలో ఆలయం పక్కనే బాలాలయం నిర్మించి అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, కలశలను ప్రతిష్ఠించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి బాలాలయంలో అమ్మ వారి దర్శనా నికి భక్తులు అవకాశంకల్పించారు.
విజయనగరంకల్చరల్, నవంబరు11(ఆంధ్రజ్యోతి):పైడిమాంబ దర్శనానికి మంగ ళవారం భక్తులు పోటెత్తారు. చదురుగుడివిస్తరణ పనుల నేపథ్యంలో ఆలయం పక్కనే బాలాలయం నిర్మించి అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, కలశలను ప్రతిష్ఠించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి బాలాలయంలో అమ్మ వారి దర్శనా నికి భక్తులు అవకాశంకల్పించారు. చదురుగుడిలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చదురు గుడిలో దర్శనాలు నిలిపివేయడంతో పక్కనఉన్న బాలాలయంలో ఉన్న అమ్మవారి దర్శనానికి క్యూకట్టారు. ఆలయం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు బాలాలయం వద్ద అమ్మవారి దర్శనం చేసుకొని భక్తులకు ఆశీర్వచనం అందించారు.