Share News

పీ-4 మోడల్‌తో అభివృద్ధి

ABN , Publish Date - May 03 , 2025 | 11:53 PM

: ప్రభు త్వ, ప్రైవేటుసంస్థలను సమన్వయం చేసుకుని, పి-4 మోడల్‌తో అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగాలని మంత్రి కొండపల్లి శ్రీని వాస్‌ పిలుపునిచ్చారు.శనివారం మండలంలోని కెంగువలో ఎన్జీఓ ఆల్‌రౌండ్‌ సంస్థ నిర్మిస్తున్న పాఠశాల పనులు పరిశీలించారు.

 పీ-4 మోడల్‌తో అభివృద్ధి
పాఠశాల భవనం పనులను పరిశీలిస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌ :

గజపతినగరం, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ, ప్రైవేటుసంస్థలను సమన్వయం చేసుకుని, పి-4 మోడల్‌తో అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగాలని మంత్రి కొండపల్లి శ్రీని వాస్‌ పిలుపునిచ్చారు.శనివారం మండలంలోని కెంగువలో ఎన్జీఓ ఆల్‌రౌండ్‌ సంస్థ నిర్మిస్తున్న పాఠశాల పనులు పరిశీలించారు. ఈసంద ర్భంగా మాట్లాడుతు పదేళ్లుగా గ్రామంలో పా ఠశాల శిథిలావస్థలో ఉన్నా స్కూల్‌ కమిటీ ఎన్నికలు జరగకపోవడంతో నిధులు మంజూ రుకాలేదని తెలిపారు.దీంతో విద్యార్థులు పాఠ శాలకు వచ్చేందుకు భయాందోళన చెందుతుం డడంతో ఎన్నికలసమయంలో ఇచ్చినహామీ మేరకు పాఠశాల నిర్మాణం స్వచ్ఛంద సంస్థకు అప్పగించినట్లు చెప్పారు.విజన్‌-2047, పి-4 మోడల్‌తో నియోజకవర్గంలో ప్రథమంగా కెం గువలో పాఠశాలనిర్మాణానికి స్వచ్ఛంద సంస్థ ముందుకురావడం అభినందనీయమన్నారు. జూన్‌ 15 నాటికి పాఠశాల నిర్మాణం పూర్తిచేసి జిల్లా విద్యాశాఖ అధికారుకులకు అప్పగించా లని సూచించినట్లు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా రు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు రూపొం దించారని చెప్పారు.రాష్ట్రంలో అభివృద్ధి, సం క్షేమం రెండుకళ్లుగా పాలనసాగుతోందన్నారు. ఇప్పటికే 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రారం భించామని, 39 పార్క్‌లకు నిధులు సిద్ధం చే స్తామని తెలిపారు. గజపతినగరం నియోజ కవర్గంలోని బొండపల్లి మండలం కొండకిం డాం, బొబ్బిలి నియోజకవర్గంలో కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో మాణి క్యంనాయుడు, డిప్యూటీడీఈవో మోహనరావు, శ్రీధర్‌,శీరం రెడ్డిరామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:54 PM