కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:20 AM
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధిసాధ్యమని టీడీపీ నాయకులు తెలి పారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వ హించారు.ఈసందర్భంగా కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ సూపర్‌సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా సామాజిక పింఛన్లు పెంపుదల, తల్లికి వందనం కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15న ప్రారంభమవుతుందన్నారు.

ఫవిజయనగరం రూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి):జిల్లాలోని నిర్వహి స్తున్న సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అన్యూ హ్యస్పందన లభిస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున చెప్పారు. విజ యనగరంలోని 2, 3, 4 డివిజన్ల పరిధిలోని పూల్‌బాగ్ ఆటోస్టాండ్ ఆవర ణలో ఆయాడివిజన్ ఇన్‌చార్జులు ప్రసాదుల ప్రసాద్,వెలిచేటి మణి కుమా రి, రొబ్బి వరలక్ష్మి, టీడీపీ నాయకులు కిల్లాన పార్వతీ, మహేశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు ఆద్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.విజయనగరం ఎమ్మెల్యే అదితి గజప తిరాజు మాట్లాడుతూ, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు సహకరిం చాలని కోరారు.
ఫచీపురుపల్లి, జూలై23 (ఆంధ్రజ్యోతి): టీడీపీ హయాంలోనే సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. బుధవారం రాత్రి పేరిపిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, నాయకులు కుచ్చర్లపా టి త్రిమూర్తురాజు, దన్నాన రామచంద్రుడు, ఎలకల అప్పారావునాయుడు, కోరాడ కోటేశ్వరరావు, మోపాడ తేజేశ్వరరావు, గడే సన్యాసప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఫలక్కవరపుకోట, జూలై 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీలేదని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.మండలంలోని రంగారాయపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో నాయకులు కరెడ్ల ఈశ్వరరావు, శ్రీను, గులిపల్లి రామునాయుడు, కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.
ఫనెల్లిమర్ల, జూలై 23(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజు ఆధ్వ ర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్ర మంలో క్లస్టర్ ఇన్‌చార్జి అట్టాడ శ్రీధర్, నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి అవనాపు సత్యనారాయణ, కౌన్సిలర్ కింతాడ కళావతి, నాయకులు కలిశెట్టి కన్నంనాయుడు, శంకరరావు, శ్రీను, చందక చిరంజీవి, గౌరి పాల్గొన్నారు.