కూటమితోనే అభివృద్ధి
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:59 PM
కూటమి ప్రభు త్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
గంట్యాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన నీలావతి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి, ఏడాదిగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కొండపల్లి భాస్కర్‌నాయుడు, అల్లు విజయకుమార్, రంధి చినరామునాయుడు పాల్గొన్నారు.
జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు
రాజాం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఆత్మనిర్భర్ సంఘటన్ అవార్డుకు ఎంపికై జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం విజయనగరం క్యాంపు కార్యాలయంలో రాజాం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రౌతు వెంకటమ్మ, జిల్లా ప్రొజెక్టు మేనేజ రు ఎ.చిరంజీవి, ఏపీఎం డి.భవానిలకు ఆయన అభినందించారు. ఈసందర్భంగా వారిని సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు రెండు అవార్డులు రావడం.. అందులో మన జిల్లాకు ఈ రెండు అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొబైల్ బుక్ కీపింగ్, సంఘ సభ్యుల ఆర్థిక లావాదేవీలు నమోదు చేసే విధానం తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. మండల సమాఖ్య ఏబీ సభ్యులు, సీసీలు పాల్గొన్నారు.