Share News

Describe the good done చేసిన మంచిని వివరించండి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:15 AM

Describe the good done ఏడాదికాలంలో ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Describe the good done  చేసిన మంచిని వివరించండి
సుపరిపాలనలో తొలి అడుగు’ పాంప్లెట్‌ను వృద్ధురాలికి అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌

చేసిన మంచిని వివరించండి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గంట్యాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఏడాదికాలంలో ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని జగ్గాపురం, మధుపాడ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత ఏడాది కాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్లో తానూ భాగమైనందుకు గర్వపడుతున్నానన్నారు. పెట్టుబడులు, పెన్షన్‌లు, తల్లికి వందనం వంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చేసిన కృషిని ప్రతి నాయకుడు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

తాటిపూడి నీరు విడుదల

గంట్యాడ మండలంలోని బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం నుంచి సాగునీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ బుధవారం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సాగునీటికి ఇబ్బంది ఏర్పడినా... చెరువులు దెబ్బతిన్నా మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తే బాగు చేస్తామని హామీ ఇచ్చారు. తాటిపూడి నీటిని విశాఖపట్టణం తాగునీటి అవసరాలకు, ఆయకట్టు రైతులకు మాత్రమే వినియోగిస్తామని, దానిని మళ్లించే ఆలోచన లేదన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎంవీ రమణ, తహసీల్దారు నీలకంఠేశ్వరరెడ్డి, ఎంపీడీఓ రమణమూర్తి, తాటిపూడి ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు కె.జగన్నాధరావు, కూటమి నాయకులు కొండపల్లి కొండలరావు, భాస్కరనాయుడు, రొంగలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:15 AM