Share News

పైశాచిక గురువు రిమాండుకు తరలింపు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:28 AM

చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన ట్యూషన్‌ ఉపాధ్యాయుడు అయిన విజయనగరం కంటోన్మెట్‌కు చెందిన బూర్ల విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సీఐ కె.దుర్గాప్రసాద రావు మంగళవారం తెలిపారు.

పైశాచిక గురువు రిమాండుకు తరలింపు

భోగాపురం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన ట్యూషన్‌ ఉపాధ్యాయుడు అయిన విజయనగరం కంటోన్మెట్‌కు చెందిన బూర్ల విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని సీఐ కె.దుర్గాప్రసాద రావు మంగళవారం తెలిపారు. ఎనిమిదేళ్ల బాలిక ముందు అసభ్యకరంగా ప్రవర్తించి.. భయాందోళనకు గురి చేశాడని, దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. ఈ మేరకు విజయ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:28 AM