కూటమితో ప్రజారంజక పాలన
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:53 PM
ప్రజారంజక పాలన కూటమి ప్రభు త్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.ఆదివారం మండలంలోని పనుకువలస గ్రామానికి చెందిన పొట్నూరు కూర్మారావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.రెండు లక్షలు చెక్కును అందించారు.
పాలకొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజారంజక పాలన కూటమి ప్రభు త్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.ఆదివారం మండలంలోని పనుకువలస గ్రామానికి చెందిన పొట్నూరు కూర్మారావుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.రెండు లక్షలు చెక్కును అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లా కొండలరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రాక్టీస్‌కు వెసులుబాటు కల్పించాలి
భామిని, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):పాక్టీస్‌కు వెసులుబాటు కల్పించాలని ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రాక్టీషనర్లు కోరారు.ఈ మేరకు భామినిలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదివారం కలిసి తమ సమస్యలను వివరించారు. కాగా భామినిలో టీడీపీ కార్యకర్త, మాజీ సర్పంచ్ లోపింటి అప్పారావును జయకృష్ణ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల విశాఖలో నెల రోజుల పాటు చికిత్సపొందారు. ఆయన వెంట కూటమి నాయకులు పాండురంగ, జగదీశ్వరరావు, ఆనందరావు, ప్రసాద్‌తోపాటు మనోజ్ ఉన్నారు.