Share News

జిల్లాలో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:12 AM

జిల్లాలో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

జిల్లాలో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం

  • మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం టౌన్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని మెసానిక్‌ టెంపుల్‌లో మంగళవా రం జరిగిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వ్యాపార సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నదని తెలిపా రు. దీనిలో భాగంగా జిల్లాలో మూడు పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతుందన్నారు. వ్యాపారసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన అధ్యక్ష, కార్యదర్శులు కాపుగంటి శ్రీనివాస్‌, బొడ్డు శ్రీనివాస్‌రావు, కోశాధికారి ప్రవీణ్‌ అంచాలీయాతో పాటు తొమ్మిది మంది ఉపాఽధ్యక్షులు, తొమ్మిది సహాయ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 12:12 AM