మతిస్థిమితం లేని మహిళ మృతి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:09 AM
శివ్వాం గ్రామానికి చెందిన నల్లకాంతం దమయంతి (59) మృతి చెందింది.
గరుగుబిల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శివ్వాం గ్రామానికి చెందిన నల్లకాంతం దమయంతి (59) మృతి చెందింది. ఆమెకు మతిస్థిమితం లేదు. మూడు రోజులుగా దమయంతి కనిపించడం లేదని గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్ కు ఆమె కుటుంబ సభ్యుడు చంద్రరావు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి నా ఆమె ఆచూకీ లభించలేదు. చివరికి గురువారం ఉదయం శివ్వాం సమీపం లోని నాగావళి నదిలో మృతదేహం ఉందన్న సమాచారంతో ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ మృతదేహం దమయంతి అని గుర్తించారు. మృతిరాలి భర్త జగన్నాఽథం 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమెకు మతి స్థిమితం లేకపో వడంతో పాటు మూర్చ వ్యాధి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.