Awas Yojana ఆవాస్ యోజనకు ముగిసిన గడువు
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:02 AM
Deadline for Awas Yojana Ends ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన పథకానికి ఆదివారంతో గడువు ముగిసింది. 15 మండలాల పరిధిలో 28,533 మంది గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలం ఉన్నా, లేకపోయినా ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేక సర్వేను నిర్వహించారు.
గరుగుబిల్లి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన పథకానికి ఆదివారంతో గడువు ముగిసింది. 15 మండలాల పరిధిలో 28,533 మంది గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలం ఉన్నా, లేకపోయినా ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేక సర్వేను నిర్వహించారు. ముందుగా గ్రామస్థాయిలో నివాసాలకు సర్వే చేపట్టారు. ఆ తర్వాత లబ్ధిదారునికి జియోట్యాగింగ్ నిర్వహించారు. దీనిపై గృహ నిర్మాణశాఖ ఈఈ వై.సోమేశ్వరరావును వివరణ కోరగా.. ‘ గత నెల రోజులుగా గ్రామాలవారీగా పీఎం ఆవాస్ యోజన పథకానికి అర్హులైన వారి వివరాలు సేకరించాం. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాం. ప్రత్యేక బృందాలు గ్రామస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికలు అందించారు. వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తాం. తదుపరి ఆదేశాల మేరకు పంచాయతీలవారీగా జాబితాలు విడుదల చేస్తాం. గృహ నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు కేటాయిస్తాయి. ’ అని తెలిపారు.