Awas Plus ఆవాస్ ప్లస్‌కు గడువు పొడిగింపు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:05 AM
Deadline Extended for Awas Plus ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ యోజన పథకానికి గడువు పొడిగించారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతనెల 30వ తేదీ వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అర్హులైన వారికి గృహాలు మంజూరుకు ఇంటింటా సర్వే చేశారు.
గరుగుబిల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ యోజన పథకానికి గడువు పొడిగించారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతనెల 30వ తేదీ వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అర్హులైన వారికి గృహాలు మంజూరుకు ఇంటింటా సర్వే చేశారు. పంచాయతీ పరిధిలో స్థలం ఉన్నా, లేకపోయినా గృహాల మంజూరుకు జియోట్యాగింగ్ నిర్వహించారు. మొత్తంగా జిల్లాలో 28,533 మంది లబ్ధిదారులను గుర్తించారు. అయితే మరికొంతమంది అర్హులు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నెల 3 నుంచి గతంలో నమోదైన వారి వివరాలు పరిశీలించనున్నారు. త్రిసభ్య కమిటీ మండల పరిషత్ అధికారి, గృహ నిర్మాణశాఖ ఏఈ, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ధ్రువీకరించిన తర్వాత గ్రామసభ ఆమోదం పొందాల్సి ఉంది. ఈనెల 14 వరకు చక్ర వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. దీనిపై పార్వతీపురం గృహ నిర్మాణశాఖ ఈఈ జి.సోమేశ్వరరావును వివరణ కోరగా.. ఆవాస్ ప్లస్ యోజన సర్వే గడువు పొడిగింపు వాస్తవమేనని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏఈలు నిశితంగా పరిశీలించి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.