LRS ఎల్‌ఆర్‌ఎస్‌కు సమీపిస్తున్న గడువు
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:16 AM
Deadline Approaching for LRS లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్) గడువు ఈ నెల23తో ముగుస్తున్నందున, భూ యజమానులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని టౌన్ ప్లానింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ చామంతి కోరారు. గురువారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
టౌన్ ప్లానింగ్ ఆర్డీడీ చామంతి
సాలూరు, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (ఎల్‌ఆర్‌ఎస్) గడువు ఈ నెల23తో ముగుస్తున్నందున, భూ యజమానులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని టౌన్ ప్లానింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ చామంతి కోరారు. గురువారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో మినహా యింపు వర్తిస్తుందన్నారు. సాఽధారణంగా మున్సిపాలిటీకి 14 శాతం ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఎల్‌ఆర్‌ఎస్ కింద ఏడు శాతం కడితే సరిపోతుందని వివరించారు. సాలూరు పట్టణంలో 5 అనధికార లేఅవుట్స్ ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బహుళ అంతస్థుల భవనాల కింద ఉన్న సెల్లార్లను పార్కింగ్‌కు కేటాయించాలని తెలిపారు. అలా కాదని వాటిని అద్దెకు ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.