ఆకులోవ గెడ్డలో మృతదేహం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:46 PM
మండలంలో కొత్తచెలిగానవలస గ్రామం దరిలో ఆకులోవగెడ్డలో మంగళవారం ఒక మృతదేహం లభ్యమయ్యింది.
రేగిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలో కొత్తచెలిగానవలస గ్రామం దరిలో ఆకులోవగెడ్డలో మంగళవారం ఒక మృతదేహం లభ్యమయ్యింది. అటుగా వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచా రం అందించారు. ఈ మృతదేహం ఇదే గ్రామానికి చెందిన లండ రామారావు (57)దిగా గుర్తించారు. దీనిపై ఎస్‌ఐ నీలావతి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 28న వెదురుబొంగులు కొట్టేందుకు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రామారావు తిరిగి రాలేదు. దీనిపై అదేరోజు భార్య కళావతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. ఈక్రమంలో మంగళవారం ఆకులోవగెడ్డ వద్ద రామారావు మృతదేహం లభ్యమయ్యింది. ఈయన కర్రలు కొడుతుండగా గెడ్డలో ప్రమాదవ శాత్తు జారి పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య కళావతితో పాటు పెళ్లయిన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.