Share News

Auto Drivers ఆటో డ్రైవర్లకు దసరా కానుక

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:10 AM

Dasara Gift for Auto Drivers రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తీపికబురు అందించింది. దసరా కానుక అందించనున్నట్లు తెలిపింది. వాహనమిత్ర పథకం కింద రూ.15 వేల చొప్పున జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌హిట్‌ వేదికపై ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

  Auto Drivers ఆటో డ్రైవర్లకు దసరా కానుక
సాలూరులో ఆటోలు

  • తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి ): రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తీపికబురు అందించింది. దసరా కానుక అందించనున్నట్లు తెలిపింది. వాహనమిత్ర పథకం కింద రూ.15 వేల చొప్పున జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌హిట్‌ వేదికపై ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో జిల్లాలో ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా మన్యంలోని 15 మండలాల్లో సుమారు 5,300 ఆటోలున్నాయి. వాటిపై ఆధారపడి సుమారు 5వేల మంది ఉపాధి పొందుతున్నారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం అమలవుతున్న నేపథ్యంలో ఇటీవల ఆటోడ్రైవర్లు తమను పట్టించుకోవాలని ర్యాలీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు దసరా కానుక ప్రకటించారు. అయితే పథకం అమలుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం విధివిధానాలు విడుదల చేయనుంది. నమోదు ప్రక్రియ యాప్‌లోనా? లేక గ్రామ, వార్డు సచివాలయాల్లోనా అన్నది తెలియజేయనుంది. కాగా బీమా, ఆర్సీ, లైసెన్స్‌ తదితర పత్రాలు అన్ని కాలపరిమిత దాటిపోకుండా ఉండాల్సి ఉంది. ‘ సూపర్‌ సిక్స్‌- సూపర్‌హిట్‌ సభలో సీఎం చంద్రబాబునాయుడు వాహనమిత్ర పథకం ప్రకటించడం ఆనందంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నెరవేర్చారు. ఆటోడ్రైవర్లు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దసరాకు రూ. 15 వేలు జమ చేస్తామనడం హర్షణీయం. ఆ డబ్బులతో ఆటో మరమ్మతు, ఇతర పనులు చేపడతాం. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.’ అని సాలూరు ఆటో డ్రైవర్లు రెడ్డి శేఖర్‌, నల్లి మహేష్‌, దోనకొండ గౌరీశంకర్‌ తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 12:10 AM