Share News

danger at gedda vagu అదుపు తప్పితే గెడ్డలోకే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:27 PM

danger at gedda vagu బొడ్డవర పంచాయతీ గిరిజన గ్రామమైన గాదెల్లోవా ప్రజలు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గెడ్డను దాటుకొని వెళ్లాల్సిందే. వర్షాలకు గెడ్డలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో గట్టుకు ఇటు అటు కలుపుతూ రెండు ఇనుప కమ్మీలు వేసి వాటిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.

danger at gedda vagu అదుపు తప్పితే గెడ్డలోకే..
విద్యార్థులను ఇనుప కమ్మీల పైనుంచి దాటిస్తున్న గిరిజనులు

అదుపు తప్పితే గెడ్డలోకే..

ఎస్‌.కోట రూరల్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): బొడ్డవర పంచాయతీ గిరిజన గ్రామమైన గాదెల్లోవా ప్రజలు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గెడ్డను దాటుకొని వెళ్లాల్సిందే. వర్షాలకు గెడ్డలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో గట్టుకు ఇటు అటు కలుపుతూ రెండు ఇనుప కమ్మీలు వేసి వాటిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ద్విచక్ర వాహనం సైతం వాటిపై నుంచే గెడ్డ దాటిస్తున్నారు. పాఠశాల పిల్లలను కూడా ఇదే మాదిరిగా దాటించామని వారు తెలిపారు.

Updated Date - Aug 26 , 2025 | 11:27 PM