Damodar as SP ఎస్పీగా దామోదర్
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:48 PM
Damodar as SP కొత్త ఎస్పీగా ఏఆర్ దామోదర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు.
ఎస్పీగా దామోదర్
వకుల్ జిందాల్‌కు గుంటూరు ఎస్పీగా బదిలీ
విజయనగరం క్రైం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొత్త ఎస్పీగా ఏఆర్ దామోదర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు. 2019లో మూడు నెలల పాటు విజయనగరం ఎస్పీగా పనిచేశారు. కాగా ఇప్పటివరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహి స్తున్న వకుల్ జిందాల్‌కు గుంటూరు ఎస్పీగా బదిలీ అయింది. ఈయన విధి నిర్వహణలో తనైదన శైలిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారు. జిల్లాలో చాలావరకు గంజాయి రవాణాను నియంత్రించగలిగారు. 14 నెలల పాటు జిల్లాలో పనిచేశారు.