దెబ్బతిన్న మడ్డువలస షట్టర్
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:55 PM
మండల పరిధిలోని శ్రీహరినాయుడుపేట, కృష్ణంవలస, మద్దూరుశంకరపేట, సోమన్నపేట తదితర గ్రామాలకు సాగునీరు అందించే మడ్డువలస 24 ఎల్ కాలువ ద్వారా సాగునీరు స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- 24ఎల్ కాలువలో స్థాయిని మించి పారుతున్న నీరు
- ఆందోళనలో రైతులు
సంతకవిటి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని శ్రీహరినాయుడుపేట, కృష్ణంవలస, మద్దూరుశంకరపేట, సోమన్నపేట తదితర గ్రామాలకు సాగునీరు అందించే మడ్డువలస 24 ఎల్ కాలువ ద్వారా సాగునీరు స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 ఎల్ కాలువకు సాగునీరు విడిచిపెట్టేందుకు ఉపయోగించే షట్టర్ స్రూ రాడ్ వ్యవస్థ దెబ్బతింది. ఇది ప్రధాన కాలువలోకి పడిపోవడంతో ఆ బరువుకి షట్టర్ పైకి లేచిపోయింది. దీంతో కాలువలోకి సాగునీరు స్థాయిని మించి ప్రవహిస్తుంది. ఆ నీరు వరి కోతలు కోసిన పొలాల్లోకి చేరుతుండడంతో రైతులు అప్రమత్తమయ్యారు. వరి పనలను గట్లపైకి చేర్చారు. పూర్తి స్థాయిలో కోతలు జరిగి ఉంటే తీవ్రంగా నష్టపోయేవాళ్లమని రైతులు వాపోతున్నారు. అపరాలు జల్లేందుకు పొలాల్లో నీరు తగ్గించామని, ఇప్పుడు పొలాల్లోకి నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి కాలువలో నీటిని నిలుపుదల చేయాలని కోరుతున్నారు.