Cyber crime is a challenge for the police సైబర్ నేరాలు పోలీసులకు సవాలే
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:59 PM
Cyber crime is a challenge for the police సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా తయారయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని కట్టడి చేయలేకపోతున్నారు. ఆయా ఘటనలతో వేర్వేరు ప్రాంతాలకు లింకులు ఉండడంతో ఛేదించడం కత్తిమీద సామె అవుతోంది.
సైబర్ నేరాలు
పోలీసులకు సవాలే
తగ్గిన ఇతర నేర ఘటనల శాతం
పెరుగుతున్న వరకట్న వేధింపులు
విజయనగరం క్రైం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా తయారయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని కట్టడి చేయలేకపోతున్నారు. ఆయా ఘటనలతో వేర్వేరు ప్రాంతాలకు లింకులు ఉండడంతో ఛేదించడం కత్తిమీద సామె అవుతోంది. జిల్లాలో సాధారణ క్రైం రేటు మాత్రం తగ్గింది. గత ఏడాది గణాంకాలతో పోల్చితే ఈ విషయం స్పష్టంగా కన్పిస్తోంది. 2023-24 సంవత్సరంలో 37 శాతం క్రైం రేటు ఉండగా, ఈ ఏడాది 34 శాతం నమోదైంది. అంటే 3 శాతం తగ్గినట్టయ్యింది. ఇదే సమయంలో సైబర్ నేరాలు బాగా పెరిగాయి. కోట్లాది రూపాయలను ప్రజలు కోల్పోయారు. సైబర్ నేరాలను పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు. మరోవైపు వరకట్నవేధింపులు,