Share News

Custard Apples సీతాఫలాలు వచ్చేశాయ్‌!

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:55 PM

Custard Apples Have Arrived! మధురఫలంగా పేరొందిన సీతాఫలాల సీజన్‌ సీతంపేట ఏజెన్సీలో ప్రారంభమైంది. ఆదివారం సీతంపేట వారపుసంతకు గిరిజన రైతులు పెద్దఎత్తున పంటను తీసుకువచ్చారు. ఒక్కో కేట్‌ ధర రూ.1000 వరకు పలికింది.

Custard Apples   సీతాఫలాలు వచ్చేశాయ్‌!
సీతంపేట వారపుసంతకు రైతులు తీసుకొచ్చిన సీతాఫలాలు

  • కేట్‌ ధర రూ.1000

సీతంపేట రూరల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): మధురఫలంగా పేరొందిన సీతాఫలాల సీజన్‌ సీతంపేట ఏజెన్సీలో ప్రారంభమైంది. ఆదివారం సీతంపేట వారపుసంతకు గిరిజన రైతులు పెద్దఎత్తున పంటను తీసుకువచ్చారు. ఒక్కో కేట్‌ ధర రూ.1000 వరకు పలికింది. సీజన్‌ ప్రారంభంలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ మైదాన ప్రాంతానికి చెందిన వ్యాపారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. వాస్తవంగా ఏటా జూలై నెలాఖరు నుంచి అక్టోబరు వరకు సీతాఫలం పంట సీజన్‌ నడుస్తుంది. ఈ ప్రాంత గిరిజన రైతులకు ఎంతో లాభం చేకూర్చే పంటల్లో ఇదొకటి. ఏజెన్సీలో పండే సీతాఫలానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.

Updated Date - Jul 20 , 2025 | 11:55 PM