Share News

Custard Apple.. సీతాఫలం.. ధర పతనం

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:54 PM

Custard Apple.. Price Crash సీతంపేట మన్యంలో ఈ సీజన్‌లో లభించే సీతాఫలాలకు ఏటాలానే ఈ సారి కూడా డిమాండ్‌ అధికంగానే ఉంది. సీతంపేట వారపుసంతలో ఆదివారం గిరిజనులు తీసుకొచ్చే పండ్లను కొనేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు ఎగబడ్డారు. అయితే వారిలో కొందరు సిండికేట్‌గా మారి ఒక్కో ట్రే ధరను రూ.600 నుంచి రూ.700 వరకు మాత్రమే పరిమితం చేశారు.

 Custard Apple..   సీతాఫలం.. ధర పతనం
సీతంపేట వారపుసంతకు గిరిజన రైతులు తీసుకొచ్చిన సీతాఫలాలు

సీతంపేట రూరల్‌, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో ఈ సీజన్‌లో లభించే సీతాఫలాలకు ఏటాలానే ఈ సారి కూడా డిమాండ్‌ అధికంగానే ఉంది. సీతంపేట వారపుసంతలో ఆదివారం గిరిజనులు తీసుకొచ్చే పండ్లను కొనేందుకు మైదాన ప్రాంత వ్యాపారులు ఎగబడ్డారు. అయితే వారిలో కొందరు సిండికేట్‌గా మారి ఒక్కో ట్రే ధరను రూ.600 నుంచి రూ.700 వరకు మాత్రమే పరిమితం చేశారు. గత వారం ఒక్కో ట్రే ధర రూ.1000వరకు పలికింది. కానీ ఈ వారం సంతకు పంట ఎక్కువగా రావడంతో వ్యాపారులు వాటి ధరను తగ్గించారు. దీంతో దీంతో చేసేది లేక గిరిజన రైతులు వారు నిర్ణయించిన ధరకే సీతాఫలాలను విక్రయించారు. ఇక్కడ కారుచౌకగా కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో ఒక్కో పండును రూ.15కు విక్రయిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 10:54 PM