Ganja గంజాయి రవాణాను అరికట్టాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:35 PM
Curb the Transport of Ganja జిల్లాలో గంజాయి, సారా అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎల్విన్‌పేట, బత్తిలిలో చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది విధులపై ఆరా తీశారు.
గుమ్మలక్ష్మీపురం/భామిని, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి, సారా అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఎల్విన్‌పేట, బత్తిలిలో చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది విధులపై ఆరా తీశారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న రహదారులను కూడా పరిశీలించాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం ఎల్విన్‌పేట, బత్తిలి పోలీస్‌స్టేషన్లను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కౌంటర్, రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులపై ఆరా తీశారు. రికార్డులు సక్రమంగా నిర్వహిం చాలని సూచించారు. ఒడిశా సరిహద్దు, ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదని తెలిపారు. బాధితులకు తక్షణ న్యాయం అందించాలని సూచించారు. రహదారులపై తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఆయన వెంట పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ హరి, ఎస్‌ఐలు శివప్రసాద్, అప్పారావు తదితరులు ఉన్నారు.