Share News

Vaccines వాగు దాటి.. వ్యాక్సిన్లు వేసి

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:55 PM

Crossing the Stream.. Administering Vaccines సంపంగిపాడు పంచాయతీ సొల్లరి గ్రామానికి వెళ్లాలంటే ఈ వాగు దాటి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురుస్తుం డడంతో సువర్ణముఖినదికి వరద పోటెత్తుతోంది. దీంతో ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఆ గ్రామస్థులు నడుంలోతు నీటిని దాటుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కాగా శనివారం కురుకూటి సబ్‌ సెంటర్‌కు చెందిన ఏఎన్‌ఎం సావిత్రికి ఇబ్బందులు తప్పలేదు.

 Vaccines వాగు దాటి.. వ్యాక్సిన్లు వేసి
వ్యాక్సిన్‌ సామగ్రితో వాగుదాటుతున్న ఏఎన్‌ఎం

సాలూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సంపంగిపాడు పంచాయతీ సొల్లరి గ్రామానికి వెళ్లాలంటే ఈ వాగు దాటి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురుస్తుం డడంతో సువర్ణముఖినదికి వరద పోటెత్తుతోంది. దీంతో ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఆ గ్రామస్థులు నడుంలోతు నీటిని దాటుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కాగా శనివారం కురుకూటి సబ్‌ సెంటర్‌కు చెందిన ఏఎన్‌ఎం సావిత్రికి ఇబ్బందులు తప్పలేదు. సబ్‌ సెంటర్‌ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దళాయివలసకు ఆటో ద్వారా ఆమె చేరుకున్నారు. అక్కడి నుంచి ఆశా కార్య‌క‌ర్త సాయంతో వాగులో వరదను దాటుకుని సొల్లరి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి గిరిజన గర్భిణులు, పిల్లలకు వ్యాక్సిన్లు వేసి తిరుగుముఖం పట్టారు.

Updated Date - Sep 13 , 2025 | 11:55 PM