పంట మార్పిడి పద్దతులను అవలంబించాలి: జేసీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:51 PM
రైతులు అధిక దిగుబడి కోసం పంట మార్పిడి పద్దతులను అవలంబించాలని జేసీ సేతుమాధవన్ కోరారు.
గంట్యాడ, డిసెంబరు 3 (ఆంరఽధజ్యోతి): రైతులు అధిక దిగుబడి కోసం పంట మార్పిడి పద్దతులను అవలంబించాలని జేసీ సేతుమాధవన్ కోరారు. బుధవారం మండలంలోని కొర్లాంలో నిర్వహించిన మీకోసం వర్క్‌షాపు నిర్వహించారు. తొలుత గ్రామానికి చెందిన రైతులు పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలోని రీసర్వే జరగడంతో పలు సమస్యలు ఉన్నాయని, గ్రీన్ పీల్డ్ హైవే కోసం సేకరించిన భూమికి సంబందించిన ప్రభుత్వం ఇస్తామన్నా 30 శాతం పరిహారం ఇవ్వలేదని, నీటి వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వివరించారు. అనంతరం జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ వరికి బదులు పంటమార్పిడి చేయడంతోపాటు ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వెంకట రమణ రైస్ మిల్లును తనిఖీచేశారు. అక్కడ నుంచి కొండతామారాపల్లిలో ఆదర్శ రైతు సాగు చేస్తున్న టమాట పంటను పరిశీలించారు. కార్యక్రమంలోని ఉద్యాన శాఖ డీడీ చిట్టిబాబు, తహసీల్దార్ నీలకంఠశ్వరరెడ్డి, ఏవో శ్యామ్ కుమార్, సీఎస్‌డీటీ నారాయణమూర్తి పాల్గొన్నారు.