క్రాప్ హాలీడే ప్రకటించాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:37 AM
శివారు గ్రామాల ఆయకట్టు రైతులకు నీరందించకపోతే క్రాప్‌హాలీడే ప్రకటించాలని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, టీడీపీ రైతుల ప్రతినిధి వారాడ సుమంత్‌నాయుడు కోరారు.
పాలకొండ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):శివారు గ్రామాల ఆయకట్టు రైతులకు నీరందించకపోతే క్రాప్‌హాలీడే ప్రకటించాలని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, టీడీపీ రైతుల ప్రతినిధి వారాడ సుమంత్‌నాయుడు కోరారు. సోమవారంపట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఆం దోళన చేపట్టారు. అనంతరం ఇరిగేషన్ డీఈకు వినతిప త్రం అందిం చారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు బంటు దాసు, రమణా రావు, పాలకొండ, రుద్రిపేట, ఓని, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.