Share News

ఉనికి కోసమే వైసీపీ నేతల విమర్శలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:56 PM

ఉనికి కాపాడుకోవడం కోసమే ప్రభు త్వంపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలి పారు.

ఉనికి కోసమే వైసీపీ నేతల విమర్శలు
మాట్లాడుతున్న నాగార్జున :

విజయనగరం రూరల్‌, నవంబరు 25 ( ఆం ధ్రజ్యోతి): ఉనికి కాపాడుకోవడం కోసమే ప్రభు త్వంపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలి పారు. మంగళవారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరుగుతున్నాయన్నారు. 24 గంటలు తిరగక ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నా యన్నది వాస్తవమా కాదా అన్నది వైసీపీ నేతలు చెప్పాలన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు కూడా సకాలంలో సాగుతు న్నాయన్నారు. రైతుల సంక్షేమానికిప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టు కోసం వైసీపీనేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతల మాటలు ద్వంద్వ వైఖరిని తలపిస్తున్నాయన్నారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే మరోమాట మాట్లాడుతున్నారని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు ముద్దాడ చంద్రశేఖర్‌, ఆల్తి బంగారు బాబు, కంది మురళీనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:56 PM