Crime Control సాంకేతికతతో నేరాల నియంత్రణ
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:44 PM
Crime Control Through Technology నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల ను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో వర్చువల్‌గా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు.
బెలగాం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల ను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో వర్చువల్‌గా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. తొలుత పెండింగ్ కేసులపై ఆరా తీశారు. వాటి పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించారు. సుదీర్ఘ పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్స్ కోర్టుకు సమర్పించాలన్నారు. గంజాయి, సారా, మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా కేసుల్లో పరారీలో ఉన్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలని తెలిపారు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించి, రోడ్డు భద్రతా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరపాలని, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో మహిళలపై దాడులు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, శక్తి యాప్, మత్తు పదార్ధాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సోషల్ మీడియా కేసులను ఏ విధంగా దర్యాప్తు చేయాలో సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ రాంబాబు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీఐలు శ్రీనివాసరావు, మురళీధర్, రంగనాథం తదితరులు పాల్గొన్నారు.