Share News

Technology సాంకేతికతతో నేర నియంత్రణ

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:05 AM

Crime Control through Technology సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అధునాతన సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఉమెన్‌ వెల్నెస్‌ రూమ్‌లను ఆయన ప్రారంభించారు.

  Technology సాంకేతికతతో నేర నియంత్రణ
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభోత్సవంలో ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించొచ్చని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అధునాతన సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఉమెన్‌ వెల్నెస్‌ రూమ్‌లను ఆయన ప్రారంభించారు. ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమాజ రక్షణలో సాంకేతిక పరిజ్ఞానం మరింత దోహదపడుతుందని తెలిపారు. మహిళా ఉద్యోగుల కోసమే ఉమెన్‌ వెల్నెస్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఎస్బీ సీఐ రమేష్‌, సైబర్‌ సెల్‌ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:05 AM