అటవీ హక్కులపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:28 AM
Create Awareness on Forest Rights అటవీ హక్కుల చట్టంపై గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఐటీడీఏలో ఎన్‌జీవో ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పార్వతీపురం, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): అటవీ హక్కుల చట్టంపై గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఐటీడీఏలో ఎన్‌జీవో ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. వారి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం పనికిరాదన్నారు. ఈ సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఏ విభాగపు రాష్ట్ర కో-ఆర్డినేటర్ బి.ఆదినారాయణరావు, ఏపీవో మురళీధర్, ఆర్‌వోఎఫ్ జిల్లా కో-ఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.