crap in good postition దండిగా దిగుబడి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:53 PM
crap in good postition జిల్లాలో వరి దిగుబడి ఘననీయంగా పెరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నమోదైంది. ఎకరాకు 26 క్వింటాళ్లు చొప్పున దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
దండిగా దిగుబడి
ఈ ఏడాది ఎకరాకు 26 క్వింటాళ్లు
జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అంచనా
ఊరట చెందుతున్న అన్నదాతలు
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి దిగుబడి ఘననీయంగా పెరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నమోదైంది. ఎకరాకు 26 క్వింటాళ్లు చొప్పున దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రైతుల కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పంట కోత ప్రయోగాల్లో పంట దిగుబడి వెల్లడైంది. ఖరీఫ్ సీజన్ మొదట్లో వర్షాలు అనుకూలంగా లేవు. జూన్, జూలై నెలల్లో వర్షాలు కురవలేదు. ఆగస్టు 15 నుంచి కురవడం మొదలైంది. రైతుల మొహంలో ఆశలు మొలకెత్తాయి. అప్పటి నుంచి గత నెలాఖరు వరకూ వానలు దంచి కొట్టాయి. కొద్దిరోజులు విరామం లేకపోవడంతో రైతులు పొలాలకు కూడా వెళ్లలేకపోయారు. మరోవైపు పంటసాగు ఖర్చులు కూడా స్వల్పంగా తగ్గాయి.
గత పదేళ్లుగా ఖరీఫ్ సీజన్ మొదట్లో వాతావరణం అనుకూలంగా ఉండి, పంట చేతికి అందే సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంటను దక్కించుకోవడానికి చాలా అవస్థలు పడేవారు. నీటి కోసం రైతుల మధ్య గొడవలు జరిగేవి. అయినా ఆర్థికంగా నష్టపోయేవారు. ఈ ఏడాది అటువంటి పరిస్ధితి లేకుండా విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 1,22,000 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇప్పటికే వరి కోతలను ప్రారంభించారు. పంట కోత ప్రయోగాల ద్వారా అధికారులు దిగుబడిని అంచనా వేస్తున్నారు.
- గత ఏడాది ఎకరాకు 23.5 క్వింటాళ్లు రాగా 2023 ఖరీఫ్‌లో 21 క్వింటాళ్లు, 2022 ఖరీ్‌ఫ్‌లో ఎకరాకు 19.5 క్వింటాళ్లు, 2021 ఖరీఫ్‌లో 18.9 క్వింటాళ్ల దిగుబడి వచ్చాంది. ఈ ఏడాది మాత్రం ఎకరాకు 26 కింటాళ్లు దిగుబడి వస్తోంది. ఈ పరిస్థితిలో జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. మిగిలిన ధాన్యాన్ని ఽరైతులు తిండి అవసరాలకు వినియోగించుకుంటారు.
దిగుబడి పెరిగింది
ఈ ఏడాది వరి పంట దిగుబడి ఘన నీయంగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలు కంటే ఈ సారి పంట ఆశాజనకంగా ఉంది. ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడి నమోదవుతోంది. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి