జిల్లాలో కొవిడ్ కలకలం
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:36 PM
జిల్లాలో కొవిడ్ కలకలం చోటుచేసుకుంది.
విజయనగరం రింగురోడ్డు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ కలకలం చోటుచేసుకుంది. నెల్లిమర్ల మండలానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి గత వారం రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా ఎంతకీ తగ్గక పోవడంతో శనివారం జిల్లా కేంద్రాసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో వైద్యులు సాధారణ పరీక్షలతో పాటు కొవిడ్ టెస్టు కూడా చేశారు. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో జీవనరాణి వద్ద ప్రస్తావించగా.. ‘నెల్లిమర్ల వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇంకా ఆయనకు మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ వ్యక్తిని ఆయన ఇంటిలోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. అతని కుటుంబ సభ్యులు, స్థానికులకు కూడా పరీక్షలు చేసేందుకు బృందాలను పంపించాం.’ అని తెలిపారు.