Yoga యోగాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:45 PM
Countless Health Benefits with Yoga యోగాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో యోగాంధ్ర నిర్వహించారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులతో కలిసి యోగాసనాలు చేశారు.
పార్వతీపురం రూరల్/గరుగుబిల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): యోగాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో యోగాంధ్ర నిర్వహించారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులతో కలిసి యోగాసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. దినచర్యల్లో అదొక భాగం కావాలని తెలిపారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. అనంతరం గరుగుబిల్లి మండలం సన్యాసిరాజుపేటలో నిర్వహించిన యోగాంధ్రలో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు, పీహెచ్‌సీ వైద్యాధికారులు, వైద్య , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.