Share News

Counseling for Teachers రాత్రి వరకూ టీచర్ల కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:33 AM

Counseling for Teachers Goes on Till Night ఎస్జీటీ బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి పది గంటల వరకు కొనసాగింది. ఉదయం సీరియల్‌ నెంబర్‌ 148 వరకు సజావుగానే ప్రక్రియ సాగింది. ఆ తర్వాత స్పౌజ్‌ కోటాలో పాఠశాల ఎంపిక విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది.

Counseling for Teachers రాత్రి వరకూ టీచర్ల కౌన్సెలింగ్‌
రాత్రి పదిన్నర గంటల వరకు జడ్పీ కార్యాలయం వద్ద వేచి ఉన్న ఉపాధ్యాయులు

సాలూరు రూరల్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఎస్జీటీ బదిలీల ప్రక్రియ బుధవారం రాత్రి పది గంటల వరకు కొనసాగింది. ఉదయం సీరియల్‌ నెంబర్‌ 148 వరకు సజావుగానే ప్రక్రియ సాగింది. ఆ తర్వాత స్పౌజ్‌ కోటాలో పాఠశాల ఎంపిక విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. ఈ విషయమై సీఎస్‌ఈ నుంచి స్పష్టత రావడంతో మళ్లీ కౌన్సెలింగ్‌ పునఃప్రారంభమైంది. సీరియల్‌ నెంబర్‌ 1 నుంచి 800 వరకు కౌన్సెలింగ్‌ జరపాలని తొలుత భావించారు. సమయాభావం వల్ల సీరియల్‌ నెంబర్‌ 1 నుంచి 500 వరకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. పలువురు తమకు నచ్చిన ప్రాంతాల్లో పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:33 AM