Share News

కేజీహెచ్‌లో విద్యార్థినులకు పరామర్శ

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:24 AM

: విశాఖ కేజీహెచ్‌లో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులను శుక్రవా రం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, గిరిజన సంఘ నాయకులు పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కేజీహెచ్‌లో విద్యార్థినులకు పరామర్శ
విద్యార్థినులను పరామర్శిస్తున్న జగదీశ్వరి

కురుపాం/గుమ్మలక్ష్మీ పురం అక్టోబరు10 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేజీహెచ్‌లో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులను శుక్రవా రం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, గిరిజన సంఘ నాయకులు పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఐ.వాణి, సీనియర్‌ వైద్యులతో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కడ్రక మల్లేశ్వరరావు, టీడీపీ మండల కన్వీనర్‌ అడ్డాకుల నరేష్‌, బీజేపీఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిమ్మక సింహచలం,ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గార గౌరీశంకర్‌, డుమ్మంగి సర్పంచ్‌ పాలక క్రాంతికుమార్‌, జనసేన కొమరాడ మండల కన్వీనర్‌ తెంటు శ్రీకర్‌, గరుగుబిల్లి జనసేన మడల కన్వీనర్‌ బోను శివ, శంకర్‌, అనం త్‌, రవి, శేఖర్‌, శంకరరావు, గోపాలకృష్ణ, హితేష్‌కుమార్‌, సుందరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:24 AM