Share News

పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:35 PM

పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అం దించడమే ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలి పారు. ఆదివారం లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటి వద్ద ఇరవై మంది సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సుమారు రూ.19 లక్షల ఆర్థిక సాయం ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీచేశారు.

పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు: ఎమ్మెల్యే
బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేస్తున్న లలితకుమారి:

లక్కవరపుకోట, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అం దించడమే ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలి పారు. ఆదివారం లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటి వద్ద ఇరవై మంది సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సుమారు రూ.19 లక్షల ఆర్థిక సాయం ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిరకాల సహాయ చర్యలు ద్వారా సుమారు మూడు కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పేదవాడిని పట్టించుకునే దాఖలాలు లేవన్నారు. దొంగతనాన్ని కూడా చిన్నదీ పెద్దదీ అంటూ వర్ణిం చడం ఒక్క జగన్‌కే చెల్లిందన్నారు. ప్రజలంతా సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వ పనితీరును పరిశీలించాలన్నారు.స్థానికసంస్థల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్‌ రాకూడదన్నారు.కార్యక్రమంలో కేబీఏ రాంప్రసాద్‌, టీడీపీమండలాధ్యక్షులు కరెడ్ల ఈశ్వర రావు, రత్నాజీ, చంద్రశేఖర్‌, జీఎస్‌.నాయుడు, కోళ్ల శ్రీను, రెడ్డి వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:35 PM