Share News

Controlling Blood Pressure ఆరోగ్యకర జీవనశైలితో బీపీ నియంత్రణ

ABN , Publish Date - May 17 , 2025 | 11:19 PM

Controlling Blood Pressure through a Healthy Lifestyle ఆరోగ్యకర జీవనశైలితో రక్తపోటును నియంత్రించొచ్చని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Controlling Blood Pressure  ఆరోగ్యకర జీవనశైలితో బీపీ నియంత్రణ
సూపరింటెండెంట్‌కు బీపీని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకర జీవనశైలితో రక్తపోటును నియంత్రించొచ్చని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసే రోగ కారకాల్లో రక్తపోటు ఒకటని తెలిపారు. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా దానిని అదుపులోకి తేవొచ్చన్నారు. సకాలంలో బీపీని గుర్తించకపోవతే శరీరంలో ముఖ్యమైన అయవాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. మరిన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. తీవ్ర తలనొప్పి, సాధారణం కంటే గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఛాతి వద్ద బిగుతుగా అనిపించడం, చిన్న చిన్న పనులు చేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే వైద్యులను సంప్రదిం చాలని సూచించారు. ఉప్పు తగ్గించుకోవడం, సమతుల ఆహారం , శారీరక శ్రమ అవసర మన్నారు. ఎన్‌సీడీ సర్వేలో గుర్తించిన బీపీ వ్యాధిగ్రస్థులను నిరంతరం పర్యవేక్షిస్తూ వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐవో ఎం.నారాయణ రావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు జగన్మోహన్‌రావు, రఘుకుమార్‌, డీపీవో లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:19 PM