Control Room ఐటీడీఏలో కంట్రోల్ రూం
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:55 AM
Control Room in ITDA పార్వతీపురం ఐటీడీఏలో సోమవారం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో ఎవరైనా తక్షణ వైద్య సేవలు పొందాలనుకునే వారు ఐటీడీఏలోని ఉప వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఈ 94914 72982 నెంబర్ ఫోన్ చేయాలని జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్‌రెడ్డి తెలిపారు.
పార్వతీపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏలో సోమవారం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో ఎవరైనా తక్షణ వైద్య సేవలు పొందాలనుకునే వారు ఐటీడీఏలోని ఉప వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఈ 94914 72982 నెంబర్ ఫోన్ చేయాలని జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్‌రెడ్డి తెలిపారు. పరిస్థితులను బట్టి వాహన సదుపాయం కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యానికి గురైన వారికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. కాగా పార్వతీపురం ఐటీడీఏలో తొలిసారిగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.