‘స్వర్ణాంధ్ర’కు సహకరించండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:27 AM
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నూతనంగా కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలను ఆమె ప్రారంభించారు. ఒక ఎక్షకవేటర్, ఎనిమిది ట్రాక్టర్లు, రెండు కాంపాక్టర్ వాహనాలను ప్రారంభిం చి, వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ3.57 కోట్లతో పారిశుధ్య వాహనాలను సమకూర్చినట్టు తెలిపారు. కార్యక్ర మంలో కమిషనర్ నల్లనయ్య, ప్రజారోగ్య అధికారి కొండపల్లి సాంబమూర్తి, ఈఈ ప్రసాద్, డీఈలు, పారిశుధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.