Share News

చెక్‌పోస్టులో నిరంతరం తనిఖీలుచేయాలి: డీఎస్పీ

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM

సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నిరంతరం పటిష్టమైన తనిఖీలు నిర్వహించాలని పార్వతీపురం డీఎస్పీ మనీషారెడ్డి ఆదే శించారు. గురువారం మండలంలోని పి.కోనవలస సమీపంలో గల ఆంధ్రా - ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టును పరిశీలించారు.తొలుత పాచిపెంట పోలీస్‌స్టేషన్‌ను సందర్శిం చి రికార్డులను పరిశీలించారు.

చెక్‌పోస్టులో నిరంతరం తనిఖీలుచేయాలి: డీఎస్పీ
చెక్‌పోస్టు వద్ద సిబ్బందితో మాట్లాడుతున్న మనీషారెడ్డి:

పాచిపెంట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నిరంతరం పటిష్టమైన తనిఖీలు నిర్వహించాలని పార్వతీపురం డీఎస్పీ మనీషారెడ్డి ఆదే శించారు. గురువారం మండలంలోని పి.కోనవలస సమీపంలో గల ఆంధ్రా - ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టును పరిశీలించారు.తొలుత పాచిపెంట పోలీస్‌స్టేషన్‌ను సందర్శిం చి రికార్డులను పరిశీలించారు. చెక్‌పోస్టులో ఆంధ్రా - ఒడిశా నుంచి వచ్చిపోయే వాహనాల రాకపోకల గురించి అడిగి తెలుసుకున్నారు. అనుమానితుల కదలికలను గమనించాలని సూచించారు. కార్యక్రమంలో సాలూరు రూరల్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ కె.వెంకటసురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:19 AM