Both Stations రెండు స్టేషన్లూ కొనసాగించండి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:13 PM
Continue Both Stations ప్రయాణిలకు సౌకర్యార్థం, వారి మనోభావాలు, సరుకు రవాణా ప్రాధాన్యతను గుర్తించి పార్వతీపురంలో యథావిధిగా రెండు రైల్వే స్టేషన్లను కొనసాగించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. ప్రజలకు ఇబ్బదులు లేని విధంగా విలీన ప్రక్రియ చేపట్టాలన్నారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన రైల్వేజోనల్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, రైల్వే ఉన్నతాధికారులను కలిశారు.
హైదరాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు నడపాలని వినతి
రిజర్వేషన్ కౌంటర్లు, వంతెన, హాల్డింగ్ సౌకర్యంపై ప్రతిపాదనలు
పార్వతీపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణిలకు సౌకర్యార్థం, వారి మనోభావాలు, సరుకు రవాణా ప్రాధాన్యతను గుర్తించి పార్వతీపురంలో యథావిధిగా రెండు రైల్వే స్టేషన్లను కొనసాగించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. ప్రజలకు ఇబ్బదులు లేని విధంగా విలీన ప్రక్రియ చేపట్టాలన్నారు. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన రైల్వేజోనల్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, రైల్వే ఉన్నతాధికారులను కలిశారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ రైల్వే అనుసంధా నంలో పార్వతీపురం కీలకపాత్ర పోషిస్తుందని , అయితే సరిపడా రైళ్లు లేక ఈ ప్రాంతవాసులు విశాఖ నుంచి ప్రయాణాలు చేయాల్సి వస్తోందని తెలిపారు. పార్వతీపురం-విశాఖపట్నం మధ్య ఇంటర్ సిటీ డెయిలీ సర్వీస్ నడపాలని, హైదరాబాద్, తిరుపతికి ఇక్కడి నేరుగా రైళ్లు వెళ్లేలా చూడాలని కోరారు. నర్సిపురం రైల్వేస్టేషన్‌లో దుర్గ్-విశాఖపట్నం, రాయగడ-గుంటూరు రైల్వే హాల్డింగ్ సౌకర్యం పునరుద్ధరించాలన్నారు. రిజర్వేషన్ కౌంటర్లు, రైల్వే వంతెనలపై ఆయన ప్రతిపాదనలు చేశారు. బెలగాం స్టేషన్ సమీపంలోని రైల్వేగేటును పదే పదే మూసి వేస్తుండడంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని, 18 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. ప్రజల అవసరాలు, అత్యవసర సమయాల్లో అంతరాయం లేకుండా రైల్వే వంతెన లేదా అండ్ పాసేజ్ నిర్మించాలని వినతిపత్రం అందించారు. దీనిపై ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.