Share News

ఎయిర్‌ పోర్టుకు విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు పరిశీలన

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:06 AM

: మండలంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు సంబందించి ఏపీఈడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌ శనివారం రావివలస, గూడెపువలస, కంచేరు ప్రాం తాల్లో పరిశీలించారు.

ఎయిర్‌ పోర్టుకు విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు పరిశీలన
విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు సంబంధించి మ్యాప్‌ ద్వారా పరిశీలిస్తున్న అధికారులు

భోగాపురం, జూలై5(ఆంధ్రజ్యోతి): మండలంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయానికి విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు సంబందించి ఏపీఈడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌ శనివారం రావివలస, గూడెపువలస, కంచేరు ప్రాం తాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టుకు విద్యుత్‌ లైన్లు ఏవిదంగా వేయాలి, ఏటువైపు ఏర్పాటు చేయాలో సంబందించి మ్యాప్‌ ద్వారా పరిశీలించా రు. ఆయనతో పాటు విజయనగరం సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.లక్ష్మణరావు, రూరల్‌ ఎగ్జిక్యుటివ్‌ ఇంజినీర్‌ జి.సురేష్‌బాబు, సత్యనారాయణ, డిప్యూటీ ఇంజినీర్‌ మాదవనాయుడు, ఏఈ షేక్‌మస్తాన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:06 AM