టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అభినందన
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:26 AM
టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లుగా నియమితులైన కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్‌లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను గురువా రం విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయనగరం రూరల్/ గంట్యాడ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లుగా నియమితులైన కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్‌లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను గురువా రం విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని మంత్రి అభి నందించి, శాలువాలతో సత్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మరింత శ్రమించాలన్నారు. పార్టీ శ్రేణులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.