Gurukula School గురుకుల పాఠశాలకు అభినందనలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:39 PM
Congratulations to Gurukula School సీతంపేట ఏపీఆర్ బాలుర గురుకుల పాఠశాలకు మంత్రి నారా లోకేశ్ పేషీ నుంచి అభినందనలు అందాయి.
సీతంపేట రూరల్, నవంబరు7(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏపీఆర్ బాలుర గురుకుల పాఠశాలకు మంత్రి నారా లోకేశ్ పేషీ నుంచి అభినందనలు అందాయి. వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పాఠశాలలో సుమారు 500మంది గిరిజన విద్యార్థులు భారతదేశ చిత్రపటం, 150 అక్షరాకృతిలో కూర్చొని అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనను గుర్తించి ఫోన్ ద్వారా మంత్రి లోకేశ్ పేషీ అభినందనలు తెలిపినట్లు ప్రిన్సిపాల్ నీలంనాయుడు శుక్రవారం తెలిపారు.