పక్కాగా జ్వరాల సర్వే చేయండి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:02 AM
జ్వరపీడితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టాలని ఆరోగ్య సిబ్బందికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశించారు. సోమ వారం మండలంలోని వెలగవలసలో హెల్త్ అసిస్టెంట్ తవిటినాయుడు ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న జ్వరాల సర్వేపై అడిగి తెలుసుకున్నారు.
బొబ్బిలి రూరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జ్వరపీడితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టాలని ఆరోగ్య సిబ్బందికి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశించారు. సోమ వారం మండలంలోని వెలగవలసలో హెల్త్ అసిస్టెంట్ తవిటినాయుడు ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న జ్వరాల సర్వేపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వఉంకుండా చూసుకోవాలని, ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచి వాతావరణ కాలుష్యం తగ్గించాలని సూచించారు. ప్రతి శుక్రవారం చేపట్టే డ్రైడే, పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి పరీక్షలు చేసే విధానంపై ఆరాతీశారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ కన్నయ్య, ఎంఎల్‌హెచ్‌పీ మౌనిక, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్యరంగానికి పెద్దపీట
బాడంగి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. సోమవారం మండలంలోని ఆనవరంలో ఉపాధిహామీ, వైద్య ఆరోగ్యశాఖల (మ్యూచువల్‌గ్రాంట్) నుంచి రూ.20.08 లక్షల నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు తెంటు రవిబాబు, మాజీ ఎంపీపీ బొంతు త్రినాథనాయుడు, మాజీ కౌన్సిలర్ ఏగిరెడ్డి శ్రీధర్, ఎంపీడీవో రామకృష్ణ, డీఈ అప్పారావు పాల్గొన్నారు.