Share News

తప్పుల్లేకుండా సర్వే చేయండి

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:52 PM

తప్పుల్లే కుండా స్వామిత్వ సర్వే చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్‌ కృష్ణతేజ సూచించారు.

తప్పుల్లేకుండా సర్వే చేయండి

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): తప్పుల్లే కుండా స్వామిత్వ సర్వే చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్‌ కృష్ణతేజ సూచించారు. మెట్టవల స గ్రామ సచివాలయాన్ని ఆయన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనతో కలిసి శనివారం పరిశీలించారు. స్వామి త్వ సర్వే ప్రక్రియ, తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేషన్‌, ఐవీఆర్‌ కాల్స్‌పై తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం జగన్నాఽథపురం సచివాలయాన్ని పరిశీలించారు. మొదటి అంతస్థులో డీడీవో కార్యాల యం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అక్టోబరు రెండో తేదీకి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. డీడీవో ఎం.కిరణ్‌కుమార్‌, ఎంపీ డీవో పి.రవికుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు పాల్గొన్నారు. గ్రీన్‌ అంబాసిడర్ల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ నాయకుడు ఎ.సురే ష్‌.. కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

తెర్లాం: ఎం.ఆర్‌.అగ్రహారం సచివాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణ తేజ శనివారం తనిఖీచేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో రాంబాబు ఉన్నారు.

బొబ్బిలి: బొబ్బిలి కోటను రాష్ట్ర పంచాయ తీ రాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ పరిశీలించారు. మ్యూజి యంలోని బొబ్బిలి ఆఖరి సంస్థానాధీశుని స్వర్ణ, వెండి సింహాసనాలు, ఆయుధాలు తదితర సామగ్రిని, బొబ్బిలి యుద్ధంలో ఆనాటి వీరులు ఉపయోగించిన ఆయుధా లను పరిశీలించారు. బొబ్బిలి రాజ వంశ చరిత్రను ఎమ్మెల్యే బేబీనాయన ఆయనకు వివరించారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

గజపతినగరం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పంచా యతీల ద్వారా అందించే సేవలు ప్రజలకు నిత్యం అం దుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ్‌ అన్నారు. గజపతి నగరం పంచాయతీ కార్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఇంటి పన్ను లకు సంబంధించి ఆన్‌లైన్‌ ప్రక్రియ ఏవిధంగా చేస్తు న్నది అడిగి తెలుసుకున్నారు. స్వామిత్వ సర్వే ప్రక్రియ పై ఆరా తీశారు. సీఈవో సత్యనారాయణ, విజయన గరం డీఎల్‌పీవో శిరీషరాణి, ఇన్‌చార్జి ఎంపీడీవో పుష్పల త, ఈవోపీఆర్డీ సుగుణాకరావు తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లి: స్థానిక ఎంపీడీవో కార్యాలయం, మూడో నెంబరు సచివాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిష నర్‌ కృష్ణతేజ శనివారం సందర్శించారు. అక్కడ అందు తున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న డీఎల్‌డీవో కార్యాలయాన్ని పరిశీలిం చారు. డీఎల్‌డీవో ఎస్‌.హేమసుందర్‌, ఎంపీడీవో ఐ.సురేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 11:52 PM