Share News

NCD Survey పక్కాగా ఎన్‌సీడీ సర్వే

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:10 PM

Comprehensive NCD Survey జిల్లాలో పక్కాగా ఎన్‌సీడీ సర్వే చేపట్టాలని జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు ఆదేశించారు. శనివారం చినబొండపల్లి, నర్సిపురంలో హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.

  NCD Survey పక్కాగా ఎన్‌సీడీ సర్వే
నర్సిపురం హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా ప్రోగ్రాం అధికారి

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పక్కాగా ఎన్‌సీడీ సర్వే చేపట్టాలని జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు ఆదేశించారు. శనివారం చినబొండపల్లి, నర్సిపురంలో హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య సేవలపై ఆరా తీసి ఓపీ, హెల్త్‌ సర్వే రికార్డులు తనిఖీ చేశారు. అక్కడ నిర్వహించిన సంచార చికిత్సా శిబిరంలో దీర్ఘకాలిక రోగుల చికిత్సా వివరాలు, మందుల లభ్యతను పరిశీలించారు. వైద్య పరీక్షలకు వచ్చిన వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఆరోగ్య సమస్యను స్పష్టంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ఆరోగ్యం ప్రతినెలా ఏ మేరకు మెరుగుపడుతుందో దృష్టిసారించాలన్నారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ తదితర వ్యాధి లక్షణాలు గుర్తించి సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూడీ డెమో గిరిబాబు, వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:10 PM