నిర్దేశిత లక్ష్యాలు పూర్తిచేయండి: ఎల్‌డీఎం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:58 PM
నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలని ఎల్‌డీఎం వీవీ రమణమూర్తి కోరారు. శనివారం బొబ్బిలి మండల పరిషత్ సమావేశంలో ఎస్‌బీఐ లీడ్‌బ్యాంక్ ఆధ్వర్యం లో మండలస్థాయి బ్యాంకర్ల, లైన్ డిపార్ట్‌మెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రమణమూర్తి ప్రభు త్వ పఽథకాల అమలు స్థితి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌సేవల లభ్యత, రుణాలు అందించే లక్ష్యాల ను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బొబ్బిలి రూరల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలని ఎల్‌డీఎం వీవీ రమణమూర్తి కోరారు. శనివారం బొబ్బిలి మండల పరిషత్ సమావేశంలో ఎస్‌బీఐ లీడ్‌బ్యాంక్ ఆధ్వర్యం లో మండలస్థాయి బ్యాంకర్ల, లైన్ డిపార్ట్‌మెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రమణమూర్తి ప్రభు త్వ పఽథకాల అమలు స్థితి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌సేవల లభ్యత, రుణాలు అందించే లక్ష్యాల ను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పఽథకాలకు సంబంధించిన రుణాల పంపిణీ, గ్రామీ ణాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి అంశాలపై చర్చిం చారు. వ్యవసాయశాఖకు సంబందించి స్వల్పకాలిక రుణాలు, కౌలు రైతులకు పంట రుణాలు, అనుబంధ శాఖలకు సంబందించి పశుపోషణకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు, హౌసింగ్ రుణాలు తదితర పధకాలకు నిర్ధేశించిన లక్ష్యాలు, వాటిలో పూర్తి చేసినవి, లక్ష్యాలను పూర్తి చేయలేకపోవడానికి గల కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై బ్యాంకుల వారీగా, పఽథకాలు వారీగా సమీక్షించి సూచనలు చేశారు. డీఆర్‌డీఏ పీడీ లక్ష్మునాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో బ్యాంకు లింకేజ్ లక్ష్యం ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 1,328 సంఘాలకు గాను 64 కోట్ల 81 లక్షలుకుగాను శత శాతం సాధించినట్లు తెలిపారు. సమావేశంలో ఏడీఏ మధుసూద నరావు, ఉద్యానశాఖాధికారి ఎస్.వెంకట రత్నం, వెలుగు ఏపీఎం భాగ్యలక్ష్మి, నాలుగు మండలాల బ్యాంకర్స్, లైన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.