PM Janman పీఎం జన్‌మాన్ పనులు పూర్తి చేయండి
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:42 PM
Complete the PM Janman Works పీఎం జన్‌మాన్ పథకం కింద మంజూరైన పనులను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి విభూ నాయర్ తెలిపారు. 2026, మార్చి తర్వాత ఆయా పనులకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
పార్వతీపురం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మాన్ పథకం కింద మంజూరైన పనులను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి విభూ నాయర్ తెలిపారు. 2026, మార్చి తర్వాత ఆయా పనులకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఆది కర్మయోగి పథకం కింద వారంలో కనీసం రెండుసార్లు గ్రామాలను సందర్శించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం సింగిల్ విండో విధానం అవలంబించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. ‘పీఎం జన్‌మాన్ కింద మల్టీపర్పస్ కేంద్రాలను ఆగస్టుకు గృహ నిర్మాణాలను సెప్టెంబరు నాటికి పూర్తి చేస్తాం. మంజూరైన 19 రహదారుల నిర్మాణాలను 9 నెలల్లో పూర్తి చేస్తాం. జిల్లాకు మూడు వసతిగృహాలు మంజూరయ్యాయి. జలజీవన్ మిషన్ పనులకు టెండర్లు పిలిచాం. నవంబరు 15 నాటికి వాటి పనులు పూర్తి చేస్తాం. ‘మన్యం’లో 190 మొబైల్ టవర్లకు గాను 137 నిర్మించాం. వాటికి అవసరమైన 11 రహదారులను కూడా మంజూరు చేశాం. గ్రామాల్లో వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి నెలలో నాలుగు నుంచి ఆరుసార్లు ఆయా ప్రాంతాలను వైద్యాధికారి సందర్శించి వైద్య సేవలు అందిస్తున్నారు.’ అని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.