యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:58 PM
యోగాతో సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నగరపాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు.
- నగరపాలకసంస్థ కమిషనర్ నల్లనయ్య
విజయనగరం రింగురోడ్డు, జూన్ 16 ( ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నగరపాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టి యోగాంధ్ర విశిష్టతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాపై చైతన్యవంతులు కావాలన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో టీపీఆర్‌వో సింహాచలం, ఆయుష్ శాఖ అధికారి ఆనందరావు, నగరపాలక సంస్థ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.